Ra Mundadugeddam Song Lyrics in Telugu Script from Kanche

Kanche latest Posters
పాట పేరు : రా  ముందడుగేద్దాం 
సినిమా : కంచె 
నటీ నటులు : వరుణ్ తేజ్ , ప్రాగ్య జైస్వాల్ 
దర్శకుడు : క్రిష్ 
సంగీత దర్శకుడు : చిర్రన్తన్ భట్ట్ 
గాయకులు : విజయ్ ప్రకాష్ , హీర్తి సగాతియా 
రచన : సిరి వెన్నెల సీతారామ శాస్త్రి 

ఈ పాటకు లిరిక్స్ పంపిన వారు మహేష్ బాబు. బోధానం. మీరు కూడా Add lyrics పేజి ద్వారా పంపించ వచ్చు.  

నీకు తెలియనిదా నేస్తమా
చెంత చేరననే పంతమా
నువు నేనని విడిగా లేమని
ఈ నా శ్వాసని నిను నమ్మిన్చని

విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా
అడిగావ భుగోలమా
నువ్వు చూసావా ఓ కాలమా

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా
రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం
రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేదం
సాదిన్చేదేముంది ఈ వ్యర్ధ విరోధం
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం
నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం
చెంత చేరననే పంతమా
ఖండాలుగ విడదీసే జండాలన్ని
తలవంచే తలపే అవుదాం ఆ తలపే మన గెలుపని అందాం

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.