నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ (లిరిక్స్) | DSP | Sagar

నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ (లిరిక్స్)

ఏ కష్టమేదురోచ్చినా
కన్నీళ్ళు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం

ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం

ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో…
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో…
ఈ పాటతో… ఈ పాటతో….

Nannaku Prematho title song composed and written by RockStar DSP and the song sung by DSP and Sagar. The Song is dedicated to DSP’s father Sathyamurthy garu.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.