Kanti Papa Lyrics - Vakeel Saab | కంటి పాప కంటి పాప


Song : Kanti Papa Kanti Papa
Music : SS Thaman
Singer : Armaan Mailk
Lyrics : Ramajogayya Sastry
Starring : Pawan Kalyan, Nivetha Thomas, Anjali

Kanti Papa Song Lyrics

కంటిపాప కంటిపాప చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వా కాలి మువ్వా సవ్వడైనా లేదే
నువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా

నీరాక ఏరువాక నీ చూపే ప్రేమలేఖ
నీలో నువ్వాగిపోకా కలిసావే కాంతి రేఖ

అంతులేని ప్రేమ నువ్వై  
ఇంత దూరం వచ్చినాక
అందమైనా భారమంత నాకు పంచినాకా

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు.. ఊఁ 
మనమన్న కొత్తమాట మొదలు

కంటిపాప కంటిపాప చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా

స ప మ ప మ ప మ గ స మ గ రి స
స పమ ప మ ప మ గ స మ గ రి స

సుదతీ సుమలోచనీ సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిణీ కరుణాగున భాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయవే చెలీ నువు పొందిన ప్రేమనీ
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా

స ప మ ప మ ప మ గ స మ గ రి స
స పమ ప మ ప మ గ స మ గ రి స

ఎదలో ఏకాంతము ఏమయ్యిందో ఏమిటో
ఇదిగో నీ రాకతో వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా 
నీకో స్నేహితుణ్ని చేశా
కాలం కాగితాలపై జంట 
పేర్లుగా నిన్ను నన్ను రాసా

ఆకాశం గొడుగు నీడ 
పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండా
ప్రేమే మన కోటగోడ
నాకు నువ్వై నీకు నేనై
ఏ క్షణాన్ని వదలకుండా
గురుతులెన్నో పెంచుకుందాం 
గుండె చోటు నిండా

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్న కొత్తమాట మొదలు

Post a comment

Previous Post Next Post